telugu navyamedia
రాజకీయ వార్తలు

బండి సంజయ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్

pawan

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ఆయనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బర్త్ డే విషెస్ చెప్పారు.బండి సంజయ్ గారికి, నా తరపున, జనసైనికుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

యాదగిరి నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఇరువురు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అన్నారు. ప్రజలకు మరింత సేవలు అందించేలా, ఇంకా ఉన్నత పదవులు మీకు లభించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Related posts