పదేళ్లలో ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు ఉత్తరాంధ్ర అభివృద్ధికే విశాఖను పాలనా రాజధానిగా తమ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే తాము మూడు రాజధానుల ప్రతిపాదన చేశామని చెప్పారు. . విశాఖకు జగన్ జన్మదిన కానుక ఇది అని ఆయన పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగుతుందని..ఆయన. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు.