ఫణి తుపాను ఒడిశాలోని పూరి దగ్గర తీరం దాటిన సంగతి తెలిసిందే. పూరికి దక్షిణంగా ఫణి తుపాను తీరాన్ని దాటింది. తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ‘ఫణి’ తుపాన్ ప్రభావంపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఈరోజు ఆయన ఫోన్ చేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏవిధంగా నిర్వరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై గవర్నర్ కు సీఎస్ వివరించి చెప్పినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, ‘ఫణి’ తుపాన్ కారణంగా ఏపీలో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోంది. 24 గంటల పాటు తుపాను గమనాన్ని అంచనా వేసి సీఎం చంద్రబాబు ప్రజలను అప్రమత్తం చేశారు. గాలులకు అరటి తోటలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే పంటనష్టం అంచనాలపై సాయంత్రం అధికారులతో మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అందరినీ ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించను: సీఎం జగన్