telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చెడ్డిలో తొండలు వేస్తాం : రేవంత్‌కు బాల్కసుమన్‌ వార్నింగ్‌

revanthreddy campaign in huzurnagar

రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  వర్క్ లేని కాంగ్రెస్‌ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ అని… ఇక్కడి ప్రచారంలో జనం లేక, హైదరాబాద్ నుండి జనాలను, పూలు తీసుకొచ్చి జేజేలు కొట్టించుకుంటూ మైక్ పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బాల్క సుమన్‌ ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర పాలకుల చెంచాలుగా, చంద్రబాబు చెప్పులు మోసిన రేవంత్ కు కేసీఆర్‌ గురించి, తెరాస గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. హైద్రాబాద్ లో మాములు పని చేసిన నువ్వు నేడు ఇన్ని కోట్లు ఎలా సంపాదించావు రేవంత్… 2018 లో కొండగల్ లో చిత్తుచిత్తుగా ఓడించి అక్కడి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని చురకలు అంటించారు. కొడంగల్ లో తంతే మల్కాజిగిరిలో పడ్డ రేవంత్, ఇక్కడ తంతే ఎక్కడ పడతాడో అని హెచ్చరించారు. శునకనందంలో పెద్దోళ్ల గురించి మాట్లాడుతున్నావని…మళ్ళీ జైల్లో చిప్ప కూడా తినడం గ్యారంటీ అని తెలిపారు. కేసీఆర్ కు పదవులు ఎడమకాలు చెప్పుతో లెక్క అని… ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడికి పోయావ్ సన్యాసి రేవంత్ అంటూ బండ బూతులు తిట్టారు బాల్కసుమన్‌. కేసీఆర్ ఉద్యమం నడుపుతున్నప్పుడు చంద్రబాబు దగ్గర చెప్పులు మోస్తూ ఉన్నాడని రేవంత్‌ పై ఫైర్‌ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబటం లేదా సన్యాసి… పదవుల కోసం పెదవులు కోసుకునే నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని నిలదీశారు. మేము ఒక్క పిలుపు ఇస్తే మా కార్యకర్తలు చింతచెట్టుకు వేలాడదీసి చెడ్డిలో తొండలు ఇడుస్తారని హెచ్చరించారు బాల్కసుమన్‌. కేసీఆర్ పేరు కాదు కదా, బాల్కసుమన్ పేరు పలికే అర్హత రేవంత్‌కు లేదని మండిపడ్డారు.

Related posts