మూడు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి నుంచి శిశువు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో పోలీసులు పాపను గుర్తించి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. శిశువును సంగారెడ్డి డీఎస్పీకి అప్పగించారు. శిశువును అపహరించిన నిందితులు బంగారి సంతోష్, శోభలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను సంగారెడ్డికి తరలించారు. శిశువు అనారోగ్యంతో ఉండటంతో వైద్య పరీక్షల కోసం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారం క్రితమే నిందితులైన సంతోష్, శోభల కూతురు ప్రసవించింది. కాగా పురిట్లోనే శిశువు మృతిచెందింది. ఆ స్థానంలో మరో శిశువును ఉంచేందుకు శిశువును అపహరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా గురువారం పాప తల్లిదండ్రులను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. జిల్లా ఆసుపత్రిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరనున్నట్టు తెలిపారు.పాపను అప్పగించిన వారికి తమ వేతనం నుంచి రూ.2 లక్షలు బహుమానం ఇస్తానని జగ్గారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
భయంతోనే చంద్రబాబు సైలెంట్: విజయసాయిరెడ్డి