telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ద‌స‌రా సెలువులు : కేంద్రం అలా… రాష్ట్రం ఇలా

మనకు ఉన్న పెద్ద పడుంగలలో ఒకటైన ద‌స‌రా పండుగ సెలువు ఎప్పుడు అనేదానిపై కేంద్రం నిర్ణ‌యం ఓలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం మ‌రోలా ఉంది… ముందుగా ప్ర‌క‌టించిన ప్ర‌కారం.. దసరా సెలవు ఈనెల 25వ తేదీనే.. అయితే, ఉద్యోగ సంఘాల విజ్ఞ‌ప్తితో ఆ సెల‌వును 26వ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.. అంటే, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఆదివారం రోజు సాధార‌ణ సెల‌వుతో పాటు.. ద‌స‌రా సెల‌వు 26న (సోమ‌వారం) కూడా ఉంటుంది.. అయితే, తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ 26వ తేదీన‌ ఐచ్ఛిక సెలవుగా ప్ర‌క‌టించారు. అక్టోబర్ 26, సోమవారం రోజున తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు అని, ఆ రోజు సెలవుదినం కాదని తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమన్వయ కమిటీ స్పష్టం చేసింది. కాగా, దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించినట్లు వార్త వైరల్ కావడంతో.. వివరణ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమన్వయ కమిటీ… అక్టోబర్ 25నే దసరా పండుగ సెలవుగా స్ప‌ష్టం చేసింది. అయితే, శ‌నివారం రోజు దుర్గాష్ట‌మి.. మ‌రునాడు (ఆదివారం) న‌వ‌మి.. కాబ‌ట్టి.. సోమ‌వారం విజ‌య‌ద‌శ‌మి.. ఆరోజే పండుగ జ‌రుపుకోవాల‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. మొత్తానికి సోమ‌వారం రోజు సెల‌వు దినంగా తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని తెలిపింది. 

Related posts