ఈ నెల 23 న లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం చేపట్టారు. తెలంగాణలో కౌంటింగ్ పై హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఓట్ల లెక్కింపు శిక్షణా కార్యక్రమంను చేపట్టారు. లోక్‌సభ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇస్తున్నారు. ఈవీఎం, వీవీప్యాట్ల లెక్కింపుపై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. నమూనా ఓట్ల లెక్కింపు కేంద్రంలో అధికారులకు ఈ శిక్షణా కార్యక్రమంను చేపట్టారు. ఈ కార్యక్రంలో లోక్‌సభ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో పాటు కౌంటింగ్ లో పాల్గొనే వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
next post
టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ మాట్లాడటం సంతోషకరం: జీవన్ రెడ్డి