ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లకు నేటితో తెర పడనుంది. నాలుగో బెర్త్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ మంగళవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ టైటిల్ గెలిచిన 2016 పరిస్థితులే ఈ సీజన్‌లో ఎదురవ్వడంతో.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశగా ఉన్నారు. మరీ వారి ఆశలను వార్నర్ సేన నిలబెడుతుందో లేదో చూడాలి. ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది.
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (సి), వృద్దిమాన్ సాహా (మ), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియామ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్
ముంబై: రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, ఇషాన్ కిషన్, క్రునాల్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, జేమ్స్ ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణి