telugu navyamedia
క్రీడలు వార్తలు

బాల్ టాంపరింగ్‌ పై వార్నర్‌ మేనేజర్‌ సంచలన వ్యాఖ్యలు…

brad took again warner wicket

నాటి బాల్ టాంపరింగ్‌ ప్రధాన సూత్రధారి కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ మళ్లీ టాంపరింగ్‌ విషయంను తెరపైకి తెచ్చాడో కానీ.. ఆ వివాదంకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ మేనేజర్‌ కూడా చేరాడు. ఆస్ట్రేలియా యాజమాన్యం అప్పుడు చేపట్టిన విచారణ హాస్యాస్పదమైందని ఆయన పేర్కొన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా తాను బంతికి ఉప్పుకాగితం రాయడం తమ బౌలర్లకు కూడా ముందే తెలుసని కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ తాజాగా అన్నాడు. దాంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా మరోసారి దానిపై విచారణ చేపట్టింది. ఈ విషయంపై ఇంకా ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయాలని తమ ఆటగాళ్లను కోరింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా యాజమాన్యం అప్పుడు చేపట్టిన విచారణ హాస్యాస్పదమైందని డేవిడ్ వార్నర్‌ మేనేజర్ జేమ్స్‌ ఎర్‌స్కైన్‌ అన్నాడు. ఆ ముగ్గురికీ శిక్ష వేసినప్పుడు.. వాళ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా కేసు గెలిచేవారన్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆటగాళ్లందర్నీ విచారించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశాడు.

Related posts