telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

200 లకే గ్యాస్ సిలిండర్… ఈ ఒక్కరోజు మాత్రమే

lpg cylinders

ఇప్పుడు మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో గ్యాస్ వాడుతున్నారు. దాంతో గ్యాస్ సిలిండర్ ధర విపణిలో రూ.700 నుంచి రూ.750 వరకు ఉన్నది.  ఇటీవలే గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచింది.  గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.200 లకే లభిస్తుంది అంటే అంతకంటే సంతోషకరమైన వార్త ఏముంటుంది చెప్పండి.  ఇయర్ ఎండింగ్ అఫర్ కింద ఈరోజు ఒక్కరోజు గ్యాస్ సిలిండర్ ను రూ.200 లకు అందిస్తున్నారు. అయితే, గ్యాస్ సిలిండర్ ను రూ.200 లకు పేటియం ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.  పేటియం ఓపెన్ చేసి రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఆప్షన్ లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ పై బుక్ చేయాలి.  మీరు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో దానిలోకి వెళ్లి ఎల్ఫీజీ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.  ఆ తరువాత పేటియం ద్వారా పే చేయాలి. ఇలా చేస్తే మీకు రూ.500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.  అంటే మీరు గ్యాస్ సిలిండర్ కేవలం రూ.200 లకే లభిస్తుంది.  అయితే, ఈ అవకాశం మొదటిసారి పేటియం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారికి మాత్రమే లభిస్తుంది. మరి మీరు త్వరగా పేటియం నుండి సిలిండర్ బుక్ చేసుకోండి.

Related posts