telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 2,296 మందికి పాజిటివ్

Corona

తెలంగాణ‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను కూడా వణికిస్తోంది.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,296 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,062 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,77,070కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,46,135 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,062కు చేరింది. ప్రస్తుతం 29,873 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 321 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Related posts