telugu navyamedia
తెలంగాణ వార్తలు

మోదీతో క‌లిసిపోయి కేసీఆర్ విందు రాజ‌కీయాలు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు… హైదరాబాద్‌లో ఉప్పల్ బస్ డిపో వద్ద బంద్ కొనసాగుతోంది. ఈ రైతు బంద్ లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. కాంగ్రెస్ , వామపక్షాలు సహా ఇతర పార్టీలతో పాటు రైతు సంఘాలు బంద్​కు మద్దతు తెలిపాయి.

ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్న రేవంత్​రెడ్డి … గతంలో రైతు బంద్‌లో కేటీఆర్ కుడా పాల్గొన్నారని గుర్తు చేశారు. మోదీని కలిసిన తర్వాత కేసీఆర్‌ వైఖరి మారిపోయిందని ఆరోపించారు. రైతు ఉద్యమానికి తొలుత కేసీఆర్ మద్దతు ఇచ్చారని, మోదీ ఏంమాయ చేశారో గాని కేసీఆర్‌లో  మార్పు వచ్చిందని ఎద్దేవా చేశారు.

అప్పుడు సంత‌కాలు.. ఇప్పుడు మెలిక‌లా? - Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

కేసీఆర్ బంద్‌లో పాల్గొనకుండా మోదీతో విందులో పాల్గొంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు. అదానీ, అంబానీలకు సాగును మోదీ తాకట్టు పెడుతున్నారన్నారు. కేసీఆర్, మోదీ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని వెల్లడించారు.

మ‌రోవైపు ..ఈ బంద్‌కు కేసీఆర్‌ మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డంతో రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్ర‌పు బ‌గ్గీపై అసెంబ్లీకి వ‌చ్చారు. అయితే, అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్ర‌పు బ‌గ్గీని అనుమ‌తించాల‌ని పోలీసుల‌కు కోరారు. దీనిక పోలీసులు అనుమ‌తించ‌లేదు. నేత‌లు వాగ్వాదానికి దిగ‌డంతో కాంగ్రెస్ నేతలు భట్టి, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి..రాంగోపాల్‌పేట పీఎస్‌కు తలించారు.

Related posts