telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

మహిళలు తప్పక ఇవి పాటించాల్సిందే !

ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు పీసీఓడీ (పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌) తో బాధపడుతూ ఉంటారు. నెలసరితో అవకతవకలు, అధిక బరువు, మానసిక సమస్యలు, అవాంఛిత రోమాలు లాంటి లక్షణాలతో బాధపడే మహిళలు సమతులాహారం, వ్యాయామాలతో పాటు కొన్ని సప్లిమెంట్లను క్రమం తప్పకుండా తీసుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది.
విటమిన్‌ బి 8 : ఐనోసిటాల్‌\ మయోనోసిటాల్‌ అనే ఈ విటమిన్‌ అండాశయాల పనితీరును మెరుగుపరిచి, నెలసరిని గాడిలో పెడుతుంది.
ఒమేగా 3: ఇది గ్లూకోజ్‌ మెటబాలిజంను క్రమబద్ధం చేస్తుంది. ఆకలిని నియంత్రించే లెప్టిన్‌ ను ఉత్పత్తిని పెంచి బరువు పెరగకుండా తోడ్పడుతుంది.
క్రోమియం : రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించిచ, ఇన్సులిన్‌ సెన్సిటివిటీని పెంచుతుంది.
ఎన్‌ ఎసిటైల్‌ సిస్టైన్‌ : ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ను తగ్గించి, ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని పెంచుతుంది.

Related posts