telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నిరాశనే మిగిల్చిన.. దర్బార్.. మూసలో రజిని చిత్రాలు ..

rajnikanth movie darbar look leak

మురుగదాస్ దర్శకత్వంలో రజినీ చేసిన ‘దర్బార్’ కూడా అనుకున్నంత హైప్ తెచ్చుకోలేకపోయింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు కనిపించడంలేదు. ‘దర్బార్’ యావరేజ్, నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. జనాల స్పందన కూడా అంతంతమాత్రంగానే ఉంది. రజినీ ఒక మూసలో కొట్టుకుపోతుండటం వల్లే ఆయన సినిమాలు సరిగ్గా ఆడటం లేదనేది స్పష్టం. ఇలాంటి తరుణంలో ఆయన కొత్త తరహా సినిమాలు చేస్తారని, పేరున్న దర్శకులతోనే జోడీని కడుతున్నారు. రంజిత్, కార్తిక్ సుబ్బరాజ్, మురుగదాస్ వీళ్లంతా ఆ కోవలోని వాళ్లే. రజినీ ఇచ్చిన అద్భుత అవకాశాన్ని రంజిత్ వినియోగించుకోలేక తన ఐడియాలజీనంతా సినిమాల్లో చెప్పే ప్రయత్నం చేసి రజినీ దెబ్బ కొట్టాడు. కార్తిక్ సుబ్బ రాజ్, మురుగదాస్‌లేమో తమ శైలిలో సినిమాలు చేయకుండా రజినీ మాయలో పడి వాళ్ల స్థాయికి తగని సినిమాలు అందించారు.

రజినీ సిగ్నేచర్ స్టైల్స్, మేనరిజమ్స్ ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. వాళ్లు దాన్ని బ్రేక్ చేసి కొత్తగా ఆయన్ను ప్రజెంట్స్ చేసి ఈ తరం ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేస్తారని, ట్రెండీ సినిమాలతో రజినీకి హిట్ ఇస్తారని అందరూ ఆశించారు. కానీ వాళ్లేమో వింటేజ్ రజినీని చూపిస్తాం. ఫ్యాన్ మూమెంట్స్‌తో విజిల్స్ కొట్టిస్తాం అంటూ రోటీన్ సినిమాలు తీశారు. ‘వేట’, ‘దర్బార్’ రెండింటిలోనూ కొత్తగా ఏమీ కనిపించలేదు. యూట్యూబ్‌ల్లో కొట్టి చూస్తే రజినీ స్టైల్స్ ఎన్ని కావాలంటే అన్ని చూడొచ్చు. మళ్లీ వీళ్లొచ్చి రజినీ స్టైల్స్ చూపించాల్సిన అవసరం ఏముంది. కథ మీద అసలు కసరత్తే లేకుండా రజినీని నమ్ముకుని సాధారణమైన సినిమాలు అందించడం ద్వారా తమ అభిమాన కథానాయకుడికి నష్టం చేశారే తప్ప. మేలు చేయలేదు.

Related posts