telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త..పడిపోయిన ధరలు

బులియన్‌ మార్కెట్‌లో రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా తగ్గాయి. అయితే ఢిల్లీ పెరగగా, ఇటు హైదరాబాద్‌లో బంగారం ధరలు బాగా పడిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 10 పెరిగి రూ. 48,070 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,070 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గి రూ. 45,490 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గి రూ. 41,700 పలుకుతోంది. బంగారం ధర తగ్గగా.. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. కిలో వెండి ధర రూ.69,300 వద్ద కొనసాగుతోంది.

Related posts