పశ్చిమ బెంగాల్ లో మమత కోటను ఢీకొట్టి బెంగాల్ లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ మమత వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా కోల్ కతా వీధుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ పై తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కార్లలో తిరగలేమని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో తాను ఎలక్ట్రిక్ స్కూటర్ పైనే తిరుగుతున్నానని ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ధరలను నియంత్రించడంలో విఫలం అయ్యినట్టు మమత పేర్కొన్నారు. కోల్ కతా మేయర్ ఎలక్ట్రిక్ బైక్ ను నడపగా, మమత బెనర్జీ స్కూటర్ పై కూర్చొని కోల్ కతా వీధుల్లో ప్రయాణం చేసారు. ఆ తర్వాత సచివాలయం నుంచి తిరిగి వచ్చే సమయంలో మమత బెనర్జీ ఎలక్ట్రిక్ బైక్ నడపాలని అనుకున్నారు. పాపం స్కూటీని నడిపేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. వ్యక్తిగత సిబ్బంది పట్టుకోగా స్కూటీని నడిపేందుకు ప్రయత్నించారు. స్కూటీ నడిపే క్రమంలో మమత కిందపడిపోగా, సిబ్బంది అప్రమత్తం అయ్యి పట్టుకున్నారు. ఆ తరువాత కోల్ కతా మేయర్ బండి నడపగా ఆమె సచివాలయం ప్రాంతం నుంచి కాళీఘాట్ కు వెళ్లారు.
previous post