టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శల అస్ర్తం వదిలారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “4వ నెల, 20వ రోజున పుట్టిన 420 గారికి… 11వ నెల, 1వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుంటే శుభాకాంక్షలు కూడా చెప్పాలనిపించలేదు. ఈ తెగులుదేశం జాతీయ అధ్యక్షుడిని మన రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వొచ్చా?” అని ఎద్దేవా చేశారు విజయ్‌సాయిరెడ్డి. మరో ట్వీట్‌లో ష”వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే అరాచకమే అంటూ శోకాలు పెట్టిన వారంతా ఏమయ్యారో? బాబు హయాంలో కంటే 18% నేరాలు తగ్గినట్టు క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. కుల,మత ఘర్షణలు, రెచ్చగొట్టే కుట్రలు జరిగినా ప్రజలు పట్టించుకోలేదు. యువ సిఎం పాలనకు ఇంతకంటే ప్రశంసలు ఏం కావాలి.” అంటూ విజయ్‌సాయిరెడ్డి పేర్కొన్నారు. అటు ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. “అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలం, కొందరు మహానాయకుల కృషికి ప్రతిఫలం ఈనాటి ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు మనమంతా ఏకమై మరింత పట్టుదలతో కృషి చేద్దాం. ముందుకు వెళదాం. రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.” అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.
previous post