telugu navyamedia
రాజకీయ వార్తలు

గంగూలీ బెంగాల్ ముద్దు బిడ్డ.. మమతా ప్రశంసలు

BJP compliant EC West Bengal

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గంగూలీ ఈ నెల 23న బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి ముందు గంగూలీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో గంగూలీ రాజకీయాల్లోకి రావడానికే ఆయనతో భేటీ అయ్యారన్న వార్తలు వెలువడ్డాయి. తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే వార్తలపై గంగూలీ స్పందిస్తూ అవి వట్టి పుకార్లేనన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. గంగూలీ బెంగాల్ ముద్దు బిడ్డ అని ప్రశంసించారు. మదర్ థెరిస్సా, అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీలు నోబెల్ బహుమతులు అందుకుని బెంగాల్ ప్రజలు గర్వపడేలా చేశారన్నారు. తాజాగా గంగూలీ కూడా ఉన్నత పదవులను అందుకుంటూ వారి సరసన చేరారని మమత మెచ్చుకున్నారు.

Related posts