telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ చరణ్ సరసన రష్మిక ?

Rashmika

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం “ఆచార్య” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా… ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌లో ప్రకటించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ముందుగా చరణ్ సరసన తమన్నా పేరు ఆతర్వాత కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. తాజాగా రష్మిక మందన్న ‘ఆచార్య’ సినిమాలో చరణ్ కు జోడీగా కనిపించనుందని మరో వార్త చక్కర్లు కొడుతుంది. చిరు – చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే ఉన్నాయి.

Related posts