telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఛార్మి నా స్టూడెంటే కాని.. నన్ను పిచ్చోడిలా చూసింది.. : రాకేష్ మాస్టర్

Charmi

టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్శీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. ఈయన 40 ఏళ్లుకుపైగా ఇండస్ట్రీలో ఉన్నారు.. 15 వందలకు పైగా సాంగ్స్‌కి కొరియోగ్రఫీ అందించారు. సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్, రామ్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు పనిచేశారు. చేతిలో సినిమాలు లేకపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్న ఈయన ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా ఆయన ఛార్మి గురించి వ్యాఖ్యానించారు. నేను చాలా సినిమాల్లో చాలా హీరోలతో పనిచేశా.. కాని ఏనాడూ పలానా హీరో నాకు నచ్చలేదు. ఆయనకు నేను డాన్స్ ఇవ్వను అని ఎప్పడూ అనలేదు. ఒకే ఒక్క దరిద్రుడు తప్ప. ఆయనే భీమనేని శ్రీనివాసరావు. ఆ సినిమా ‘నీతోడు కావాలి’. చార్మి ఫస్ట్ సినిమా అదే. ఆమె కూడా నా స్టూడెంటే. కాని ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చక్రం సినిమా అప్పుడు ఏమ్మా బాగున్నావా? అని అడిగా. ఆమె నావైపు ఇలా చూసి ముఖం తిప్పేసుకుంది. ‘నీకు సిగ్గుందిరా రాకేష్.. చార్మిని బాగున్నావా అని ఎందుకు అడిగావ్’ అనిపించింది. పక్కనే ఉన్న ప్రభాస్ గుర్తుపట్టి పలకరించారు. చార్మి మాత్రం వీడెవడో పిచ్చోడు అని నన్ను చూసి నవ్వుకుంది.

Related posts