telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు: సీఎం జగన్

cm jagan on govt school standardization

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఉగాది పండగ నాటికి పట్టాల పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారిని గుర్తించాలని అన్నారు. ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని అన్నారు.

అత్యాధునిక పరికరాలు ఉపయోగించి భూముల సమగ్ర రీసర్వే త్వరగా పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.ఇళ్ల స్థలాల కోసం 23,448 ఎకరాలు గుర్తించామని అధికారులు సమావేశంలో జగన్ కు వివరించారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారన్న అంచనా ఉందని తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన భూమి ద్వారా తొమ్మిది లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగల్గుతామని అధికారులు వివరించారు.

Related posts