telugu navyamedia
క్రీడలు వార్తలు

క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు స్పోర్ట్స్ క్విజ్ పోటీలు

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించేలా జిహెచ్ఎంసి ప్రతి ఏడాది సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తున్నది. వీటితో పాటు క్రీడా పరిజ్ఞానాన్ని పెంచేందుకు స్పోర్ట్స్ క్విజ్ నిర్వహించి విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుతోంది.

ఖైరతాబాద్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో విద్యార్థులకు స్పోర్ట్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు స్థానిక  గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ డాక్టర్  సురేఖ ఓం ప్రకాష్ బీశ్వ బహుమతులు అందజేశారు.  ప్రథమ బహుమతి రజిత – గుణ సాయి, ద్వితీయ బహుమతి స్కందన్ – రఘు, తృతీయ బహుమతి ప్రీత్ జంగ్ – సూరజ్ శీలం పొందారు.

జిహెచ్ఎంసి నగరవ్యాప్తంగా స్పోర్ట్స్ క్విజ్ ను నిర్వహించడం జరుగుతుంది. మే 9వ తేదీన చార్మినార్  జోన్ లో గౌలిపుర పీజీ గ్రౌండ్ లో, మే 10వ తేదీన  సికింద్రాబాద్ జోన్ స్విమ్మింగ్ పూల్ వద్ద నిర్వహించడం జరుగుతుంది. మే 11వ తేదీన కూకట్ పల్లి – శేర్లింగంపల్లి  జోన్ చందానగర్ పిజేఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించడం జరుగుతుంది.  మే 12వ తేదీ ఎల్బీనగర్ జోన్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనుంది. ఆయా జోన్ లో గెలుపొందిన విజేతలకు మే 13న విక్టరీ గ్రౌండ్ లో గ్రాండ్ ఫైనల్ నిర్వహిస్తారు. ఈ క్విజ్ పోటీలను 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల విద్యార్థులు జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

విక్టరీ ప్లే గ్రౌండ్ లో నిర్వహించిన స్పోర్ట్స్ క్విజ్ కార్యక్రమంలో గేమ్స్ ఇన్స్పెక్టర్ మాధవి, టెన్నిస్ కోచ్ ముని రెహ్మద్, బాస్కెట్ బాల్ కోచ్ నయీం తదితరులు పాల్గొన్నారు.

Related posts