telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రూ. 8 కోట్ల 54 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన వైకుంఠదామం ను మంగళవారం ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

మానవుల చివరి మజిలీలో పాల్గొని బంధువులకు సకల సౌకర్యాలు కల్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన ఉద్దేశం. నగరంలోని ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు విశేష కృషి చేస్తున్న నేపథ్యంలో  మోడల్ వైకుంఠదామలను ఎవ్వరూ ఊహించని విధంగా సకల సౌకర్యాలతో  నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో  బేగంపేట్ శ్యామ్ లాల్ బిల్డింగ్ వద్ద రూ. 8 కోట్ల 54 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన మహా పరినిర్యానం ( వైకుంఠదామం) ను రాష్ట్ర మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్  మంగళవారం ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా శ్మశానవాటికలో  అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణం, సెరిమోనియల్ హాల్, చెక్క నిల్వ గది, పిండ ప్రదానం చేసే ప్రాంతం, వెయిటింగ్ హాల్, బాడీ ప్లాట్‌ఫారమ్‌లు, ఫీచర్ గోడలు, ప్రవేశం, నిష్క్రమణకు తోరణాలు, ఫలహారశాల, నీటి వసతితో సహా టాయిలెట్ బ్లాక్‌ల ఏర్పాటు, పాత్ వేస్ అభివృద్ధి, పార్కింగ్ ప్రాంతం అభివృద్ధి, వైఫై సౌకర్యం, సి.ఎస్.ఆర్ పద్దతిన శివుని విగ్రహం ఏర్పాటు, రెండు అంతిమ యాత్ర వాహనాల ఏర్పాటుతో పాటు సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది.

Related posts