telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

భక్తులు లేకుండా భద్రాద్రిలో రాములవారి కళ్యాణం

bhadrachalam kalyanam

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగుతుంది. స్వామివారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిత్య కల్యాణ మండపంలో రాములవారి కళ్యాణం జరుగుతోంది.

ఈసారి రాములవారి కల్యాణోత్సవం నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో భక్తులు లేకుండానే రాములవారి కళ్యాణం జరుగుతోంది. కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో సీతారాముల కల్యాణ వేడుకలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా ప్రజలెవరూ హాజరుకావొద్దని ప్రభుత్వం సూచించింది. .

Related posts