telugu navyamedia
రాజకీయ వార్తలు

భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది: ఇరాన్‌ కు ట్రంప్ వార్నింగ్

trump usa

ఇరాన్‌ అణు సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నాలు జరపుతుందని అమెరికా ఆంక్షలు విధించడం, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరికలు చేశారు. ఇరాన్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు ఆ దేశంలోని అమెరికా సైనిక బలగాలపై, ఆస్తులపై దాడి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు.

ఇరాన్‌ దాడులకు పాల్పడితే ఇరాన్‌ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. మూడు నెలల క్రితం బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా రాకెట్‌ దాడులు జరిపి ఖాసీం సులేమానీని చంపడంతో పరిస్థితులు మరింత చేజారాయి. దీంతో ఇరాన్‌లోని అమెరికా ఆస్తులపై దాడులు జరిగాయి. మరోసారి ఇలాంటి దాడులు చేయాలని ఇరాన్‌ ప్రయత్నిస్తోందని ట్రంప్‌ చెప్పారు.

Related posts