telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

షాకింగ్ : మూసాపేట్ లో పిల్లర్ వద్ద కుంగిన రోడ్డు

హైదరాబాద్‌కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం బలహీన పడనుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరో వైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.  భారీ వర్షాలకు ముసా పేట మెట్రో స్టేషన్ కింద రోడ్డు కుంగింది.

భారీగా వరద రావడంతో పాటు… పిల్లర్ల కోసం తీసిన గోయ్యు కారణంగా .. రోడ్డు కుంగిపోయింది. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగిపోవడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారి కేడ్ ఏర్పాటు చేశారు.   భారీ గుంత ప‌డ‌టంతో ప్రజలు భ‌య‌ప‌డుతున్నారు. అయితే, మెట్రోకు ఇబ్బంది లేద‌ని… గ‌తంలో తవ్వి, రోడ్డు వేసిన చోట కుంగిపోయిందే త‌ప్ప మెట్రోకు వ‌చ్చిన ఇబ్బందేమీ లేదంటున్నారు అధికారులు. అలానే మెట్రో ట్రాక్ కోసం వేసిన పిల్లర్ చాలా లోతులో వేసిందని దానికి రోడ్డు కుంగడానికి ఏమీ సంబంధం లేదని చెబుతున్నారు. 

Related posts