telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా లిస్ట్ లో చేరిన మరో లక్షణం…

corona vairus

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. అయితే ఈ వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశంలో లాక్ డౌన్ విధించారు. అయితే మొదట్లో కరోనా లక్షణాల్లో వ్యాధి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు క‌నిపించినా.. ఆ తర్వాత‌ కండ్లు ఎర్రబడటం కూడా కరోనా  లక్షణమే అన్నారు. ఆ తర్వాత ఇక‌, రుచి, వాస‌న తెలియ‌క‌పోవ‌డాన్ని కూడా చేర్చారు. కరోనా లక్షణాల లిస్ట్‌లో విరోచ‌నాలు కూడా చేరిపోయాయి. ఆ త‌ర్వాత ఎక్కిళ్లు రావడం కూడా మ‌రో ల‌క్ష‌ణంగా తేల్చారు. ఇక ఇప్పుడు తాజాగా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గితే కరోనా సోకినట్లుగా అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు. మిగిత కరోనా లక్షణాలు లేకపోయిన రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను ప్రమాణంగా తీసుకుని ఆ మేరకు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించనప్పటికీ ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. వీరిని కూడా కరోనా సోకినట్లుగానే భావించి చికిత్స అందించాలని స్ప‌ష్టం చేశారు. అయితే, కరోనా సోకిన అందరిలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గకపోవచ్చని చెబుతున్నారు వెద్యులు.

Related posts