నిర్భయ దోషుల ఉరితీతపై విధించిన స్టే ఎత్తివేయలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.స్టే తొలగించాలంటూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ మేరకు సదరు పిటిషన్లను కొట్టివేసింది. నిర్భయ దోషులకు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు వారం రోజుల సమయం ఇచ్చామని, ఆ గడువు ముగిసిన తర్వాతే వారి ఉరితీతకు సంబంధించిన విచారణ షురూ అవుతుందని న్యాయస్థానం వెల్లడించింది.
నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ కు అన్ని అవకాశాలు ముగిశాయి. అతడి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్లకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా విఫలమైంది. మరోవైపు అక్షయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది.