ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే 22 లేదా 23 స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తలసాని మండిపడ్డారు.
చంద్రబాబు చరిత్ర తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.చంద్రబాబు ఓడిపోతే హైదరాబాద్ లోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీని కాపికొట్టి ‘ఆయుష్మాన్ భారత్’: కేసీఆర్