telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బ్లాక్ ఫంగస్ కేసుల‌ చికిత్సకు స‌ర్కార్ నోడల్ కేంద్రం ఏర్పాటు…

ప్రస్తుతం తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలవర పెడుతుంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ కేసుల‌ చికిత్సకు స‌ర్కార్ నోడల్ కేంద్రం ఏర్పాటు చేసిన‌ట్టు వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్. ఈఎన్టీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా ప్ర‌క‌టించింది తెలంగాణ ప్ర‌భుత్వం.. బ్లాక్ ఫంగస్ భారిన పడి, కోవిడ్ పాజిటివ్ గా ఉన్న వారికి గాంధీతో చికిత్స అందించ‌నున్నారు. కోవిడ్ బారిన‌పడిన కొందరిలో బ్లాక్ ఫంగస్ సమస్యను గుర్తించినట్టు ప్ర‌క‌టించారు డీహెచ్ శ్రీనివాస రావు… కోవిడ్ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్ లెవల్ ని సరిగా అదుపు చేయాలని ఆస్ప‌త్రులు, వైద్యుల‌కు కీల‌క సూచ‌న‌లు చేసిన ఆయ‌న‌… కోవిడ్ సమయంలో బ్లాక్ ఫంగస్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసేందుకే అవసరం అయితే స్టిరాయిడ్‌ల‌ను వాడాల‌ని సూచించారు.. అవసరం అయితే యాంటి ఫంగల్, యాంటీ బయోటిక్ మందులు వాడాలని ఆదేశాలిచ్చారు.

Related posts