telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అమిత్ షా రోడ్ షో నిలిపివేత.. కారెక్కిన షా !

Amit

రెండు రోజుల్లో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నాయకులు వచ్చి ప్రచారం చేసి వెళ్ళారు ఈరోజు ఉదయం కేంద్ర హోం మంత్రి ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షా కూడా హైదరాబాదులో ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు. ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఇ సన్నిధిలో కలశ పూజ చేసి నాయన వారసిగూడ నుంచి రోడ్ షో ప్రారంభించారు. అయితే రోడ్ లోని మధ్యలోనే అర్ధంతరంగా ముగించినట్లు సమాచారం అందుతోంది రోడ్ షో కి భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో రోడ్ షో కోసం ఏర్పాటుచేసిన బస్సు దిగి కారులో ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయారు అని చెబుతున్నారు. అయితే ఆయన ప్రసంగించాల్సి వేదిక వద్దకు వెళ్లి అక్కడి నుంచి ప్రసంగిస్తారని భావించిన ఆయన అక్కడ కూడా ఆగకుండా నేరుగా నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ కి చేరుకున్నట్లు సమాచారం. ఇక షెడ్యూల్ ప్రకారం ఆయన నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో లంచ్ చేయాల్సి ఉంది. అయితే రోడ్షో సమయంలో ఆయనకు నీ మాత్రలు వేసుకుని ఉండటం కూడా కనిపించింది.

Related posts