telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

సెకండ్ వేవ్ టైమ్ లో.. బెల్లం తింటే మంచి ఫలితాలు!

తీపి కోసం చక్కెరని వాడడం అందరికీ అలవాటుగా మారింది. అయితే చక్కెర కన్నా బెల్లం వాడకం ఎంతో మంచిది. ఎందుకంటే బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీనివల్ల అధికంగా క్యాలరీలు చేరుతాయన్న ఆందోళన, అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండవు. ఈ క్రమంలోనే నిత్యం రోజూ రాత్రి పూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను తింటే కాలేయం కూడా శుద్ధవుతుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్‌ ఎంజైమ్‌లను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం, గ్యాస్‌, అసిడిటీ సమస్యలూ ఉండవు.బెల్లం మన శరీరంలోని లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. లివర్‌ను శుభ్రపరిచేందుకు బెల్లం పనికొస్తుంది. నిత్యం బెల్లంను తింటుంటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో లివర్‌ శుభ్రంగా ఉంటుంది. లివర్‌ సంబంధ అనారోగ్యాలు రావు. అధిక బరువు తగ్గుతారు.బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ సమతుల్యంలో ఉంటాయి. దీంతో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. శరీర మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. దీంతోపాటు శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. గుండె జబ్బులు రావు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో బెల్లం తింటే… రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Related posts