telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక సినిమా వార్తలు

న్యూ ఇయర్ వేడుకలు ముందుగా, చివరగా జరిగేది ఈ దేశాల్లోనే…!

New-Year

కొత్త సంవత్సరం అంటేనే కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, తీర్మానాలు. ఆ మధురక్షణాలకోసం ప్రతిఒక్కరూ ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే అసలు ఈ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే సంప్రదాయం ఎప్పుడు మొదలైందనే విషయంపై భిన్నవాదనలున్నాయి. జూలియన్ క్యాలెండర్ విషయంపై భిన్నవాదనలున్నాయి. జూలియన్ క్యాలెండర్ లేదా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటో తేదీని ప్రపంచవ్యాప్తంగా నూతనసంవత్సర ఆరంభదినంగా తీర్మానించారు. దాదాపుగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచే నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటున్నారని ఒక అంచనా. ప్రాంతాలు, సంస్కృతి సంప్రదాయాలనుబట్టి కొన్ని దేశాలు ఇతర తేదీలను కూడా సంవత్సరాదిగా పాటిస్తున్నాయి. రష్యా వంటి కొన్ని దేశాలు ఒక్క ఏడాదిలోనే రెండుసార్లు నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటాయి. భూభ్రమణాన్ని బట్టి వివిధ టైంజోన్ల కారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

ముఖ్యంగా ప్రపంచంలో అందరికంటే మొదటగా న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ప్రవేశిస్తుంది. న్యూజిలాండ్ ఛాథమ్ దీవుల్లో మొట్టమొదట న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు. ఇక్కడ వేడుకలు మొదలైన ఇరవై నాలుగు గంటల తర్వాత భూగోళం మీద అందరికంటే చివరిగా, అమెరికాలోని సమోవా దీవుల్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. విచిత్రం ఏమిటంటే, న్యూజిలాండ్‌లోని ఛాథమ్ దీవులకు, సమోవా దీవులకు మధ్య దూరం కేవలం 554 మైళ్ళే! విమానంలో కేవలం గంట ప్రయాణం!

Related posts