ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం పట్టణాల్లో, గ్రామాల్లో భూమి ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగా మొదట పేదల కోసం పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల భూమిని ఇవ్వబోతున్నది. ఈ భూమిలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకోవడానికి తగిన సహాయం కూడా ప్రభుత్వం చేయబోతున్నది. వచ్చే ఉగాది వరకు అన్ని రకాల అనుమతులతో పేదలకు భూమిని ఇవ్వబోతున్నారు. అయితే, భూమి ఇచ్చిన తరువాత దానిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేదలకు కేవలం రూపాయి ఖర్చు పెడితే సరిపోతుంది. రూపాయికే పేదలకు రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. మాములుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. పేదలు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం కుదరని పని అందుకే పేదల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు కన్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో విడివిడిగా ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారుల జాబితాలను విధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని కూడా సీఎం ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా వారికి తెలియజేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఇప్పటివరకూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య 20,47,325గా ఉన్నట్టు తేలింది. లబ్దిదారుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకూ 19,389 ఎకరాల భూమిని గుర్తించారు. మరో 8వేల ఎకరాలు అవసరమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ భూమిని కూడా త్వరలోనే గుర్తిస్తామని అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 2,559 ఎకరాలను గుర్తించామని, ఇక్కడ ఇంకా 11వేల ఎకరాలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
జగన్ నామినేషన్లు కూడా తెలంగాణలోనే వేస్తారా?: లోకేశ్