telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

ఏప్రిల్ 19 సోమవారం దినఫలాలు :  ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు, అవార్డు, ఇంక్రిమెంట్ వంటి శుభపరిణామాలు                      

మేషం : ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. దాంపత్య సుఖం. వాహన యోగం వంటి శుభ ఫలితాలున్నాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. దైవ దర్శనాలు చేస్తారు. మీ మాటకు ఇంటా బయటా ఆదరణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ఆందోళన కలిగిస్తాయి.

వృషభం : ఉద్యోగస్తులు సమర్థఁగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. ప్రేమికుల అతి చొరవ, సాహసం ఇబ్బందులకు దారితీస్తాయి. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏదో ఒక పొరపాటు జరిగే ఆస్కారం ఉంది. రావలసిన ధనంలో కొంతమేరకు వసూలు కాగలవు.

మిథునం : ఆర్థిక కుటుంబ సమస్యలు చక్కబడతాయి. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులలో నూతనోత్సాహం నెలకొంటుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. కొన్ని అవకాశాలు అప్రయత్నంగా కలిసివస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది.

కర్కాటకం : వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. స్త్రీలకు అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయ విక్రయాలు లాభదాయకంగా సాగుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు.

సింహం : ఆర్థిక వ్యవహారాలు, నూతన వ్యాపారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. శుభకార్యాలకు యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలనం, కొత్త బాధ్యతలు వంటి ఫలితాలున్నాయి. క్రయ, విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలకు అన్ని విధాలా కలిసిరాగలదు.

కన్య : ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు, అవార్డు, ఇంక్రిమెంట్ వంటి శుభపరిణామాలుంటాయి. ఖర్చులు కుటుంబ అవసరాలు పెరుగుతాయి. గృహంలో ఒక శుభకార్యం చేపడతారు. విద్యార్థుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. బంధువులను కలుసుకుంటారు.

తుల : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తి, పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనం విలువైన వస్తువులు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. స్త్రీలు ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు.

వృశ్చికం : ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కళ, క్రీడా రంగాలకు గుర్తింపు లభిస్తుంది. మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. స్త్రీల మనోవాంఛలు నెరవేరగలవు. నూతన వ్యాపారాలు లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో జయం పొందుతారు.

ధనస్సు : ఆర్థిక స్థితి కొంత ఫర్వాలేదనిపిస్తుంది. మెడికల్, న్యాయ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలనం, కొత్త బాధ్యతలు వంటి ఫలితాలున్నాయి.

మకరం : విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఏ వ్యవహారం కలిసి రాకపోవడంతో ఆందోళన చెందుతారు. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగించవలసి వస్తుంది.

కుంభం : భాగస్వామిక సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వస్త్ర ప్రాప్తి, వాహన యోగం వంటి శుభ సంకేతాలున్నాయి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చియం కాగలవు. ఉద్యోగస్తులుక రావలిసి అలవెన్సులు, అరియర్స్ మంజూరవుతాయి.

మీనం : స్త్రీలకు గృహోపకరణాలు, గృహాలంకరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు గణనీయంగా పెరిగే ఆస్కారం ఉంది. స్థిరచరాస్తులు క్రయ విక్రయాలకు అనుకూలంగా మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ఆపద సమయంలో మిత్రులు ఉండగా నిలుస్తారు.

Related posts