telugu navyamedia
క్రీడలు వార్తలు

తన సెంచరీ సెలబ్రేషన్స్ కు కారణం చెప్పిన రాహుల్…

క్రికెట్‌లో ఏ ఫార్మాటైనా బ్యాట్స్‌మెన్‌ సెంచరీ సాధిస్తే.. ఆ అనుభూతే వేరు. అది ఆ ఆటగాడికే కాకుండా అభిమానులకూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సెంచరీ అంటే అంత విలువ మరి. సెంచరీ చేసినప్పుడు ఒక్కో ఆటగాడు ఒక్కోలా సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. చాలామంది బ్యాటును పైకిలేపి వందనం చేస్తారు. కొందరు పైకి ఎగిరి పంచ్‌ ఇస్తారు. టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం అందరికంటే భిన్నంగా వేడుకలు చేసుకుంటాడు. హెల్మెట్‌ తీసి బ్యాటు కిందపెట్టి రెండు చేతులతో చెవులను మూసుకుంటాడు. అందరికంటే బిన్నంగా సెంచరీ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటాడో కేఎల్ రాహుల్‌ శుక్రవారం తెలిపాడు. భారత్ ఇన్నింగ్స్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ… ‘బయట నుంచి వచ్చే శబ్ధాన్ని నిలువరించడానికే అలా చేశాను. అంతేతప్ప ఎవరినీ అగౌరవపరచడానికి కాదు. మనల్ని వెనక్కి లాగే చాలామంది బయట ఉంటారు. అన్నిసార్లూ వారిని పట్టించుకోకూడదు. నా సంబరాల అసలు సందేశం అదే. ఇందులో మరే ఉద్దేశం ఏమీ లేదు’ అని స్పష్టం చేశాడు. అయితే ఇంగ్లాండ్ పై రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన రాహుల్ ఈరోజు జరగనున్న మూడో వన్డేలో ఎలా రాణిస్తాడో చూడాలి.

Related posts