నేడు హైదరాబాద్ లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు పరిణామాలపై తెలంగాణలో 35 సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 17న మోదీ జన్మదినం సందర్భంగా.. 14 నుంచి 20 వరకు సేవా వారం కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై పోరాటం ఉధృతం చేయాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.
బీజేపీ బలం చూసి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తోందని మనోహర్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ క్లస్టర్‌లు ఏర్పాటు చేసి పోరాడుతామని మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.