ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ మాట్లాడుతూ… ‘మూడు ఫార్మాట్లు ఆడే గొప్ప ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. విరాట్ కోహ్లీకి కేన్ అన్నింటా సమానమే. కాకపోతే కేన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ అనుచరులు లేరు. ఇదొక్కటే తేడా. కోహ్లీ తరహాలో వాణిజ్య ఒప్పందాల ద్వారా 30-40 మిలియన్ డాలర్లు ఏటా సంపాదించడు. ఇక నాణ్యత, మైదానంలో అనుభవం, నిలకడ పరంగా చూస్తే.. కేన్ ఎక్కువ పరుగులు చేస్తాడు. ఉదాహరణకు 3 టెస్టుల్లో కేన్, 6 టెస్టుల్లో విరాట్‌ను పోలిస్తే. ప్రొ రేటా ప్రకారం ఈ వేసవిలో విలియమ్సన్ ఎక్కువ పరుగులు చేయగలడు’ అని అన్నాడు. ‘కేన్ విలియమ్సన్ భారతీయుడైతే.. అతడే ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడు అవుతాడు. సోషల్ మీడియాలో మీరు ఒప్పుకోరు కాబట్టి విరాట్ కోహ్లీ గొప్ప కాదని అనను’ అని గతంలో మైకేల్ వాన్ అన్న సంగతి తెలిసిందే. అయితే తొలిసారి ప్రవేశపెట్టిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, న్యూజీలాండ్ తలపడనున్నాయి. భారత్ మొత్తంగా 24 మ్యాచుల్లో 2914 పాయింట్లు అందుకొంది. మరోవైపు న్యూజిలాండ్ 18 టెస్టులాడి మొత్తం 2166 పాయింట్లు సంపాదించింది.
previous post