telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మామ తర్వాత అల్లుడితో తరుణ్ భాస్కర్‌..?

Akkineni

అక్కినేని నాగ చైతన్య తన మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాలో తన మార్క్‌ను చూపించారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కథలోని కొత్తదనాన్ని చూపించేవారు. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. చైతు ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ సినిమాను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాలో నాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చైతు చేస్తున్న సినిమా థాంక్యు.  ఈసినిమాను మనం దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత చైతన్య పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్‌తో సినిమా చేయనున్నారంట. అంతేకాకుండా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్‌గా చైతన్య కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలోనే ఈ సినిమాపై క్లారీటీ రానుందంట. ఇదిలా ఉంటే చైతన్య తాజా చిత్రం థాంక్యులో ముగ్గురు హీరోయిన్‌లు నటించనున్నారు. ఈ సినిమాలో చైతన్య హీకీ ప్లేయర్‌గా దర్శనమివ్వనున్నారు. చూడాలి మరి ఈ సినిమాలు నాగ చైతన్యను ఏ రేంజ్ లో నాబెడతాయి అనేది.

Related posts