telugu navyamedia
సినిమా వార్తలు

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రెటీలు

వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. కరోనా నిబంధనలతో గణేశుడు మండపాలల్లో కొలువుదీరాడు. వినాయక చవితి సందర్భంగా సినీ నటులు.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి త‌న ఇంట్లో మ‌ట్టితో చేసిన వినాయ‌కుడికి భార్య‌తో క‌లిసి పూజ‌లు చేశారు. ‘‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో.. జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, ఆటంకాలు తొలగి అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ది పథంలో సాగాలని కోరుకొంటున్నాను’’ అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాల పట్టి ఆర్హా తన చిట్టి చేతులతో మట్టి గణేశుడ్ని తయారు చేసింది. హీరో నాని ఆయన కుమారుడు అర్జున్‌తో పూజ చేస్తున్న ఫొటో అభిమానులతో పంచుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ‘మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.. వినాయకుడు తన అనంతమైన జ్ఞానంతో మన జీవితాలను సుసంపన్నం చేస్తాడు’ అని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. విలక్షణ నటుడు మోహన్‌బాబు వినాయక చవితి కథను చదువుతూ ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, సమంత, రకుల్‌, సాయిధరమ్‌ తేజ్‌.. ఇలా పలువురు ఇన్‌స్టా, ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

 Tollywood : వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ Photo : Twitter

 Tollywood : వినాయక చవితి పూజల్లో జబర్దస్త్ వర్ష Photo : Twitter

 Vinayaka Chavithi: ఎమ్మెల్యే ఆర్కే రోజ ఇంట్లో సందడే సందడిగా మారింది. ఈ ఏడాది అంతా శుభమే జరగాలని కోరుతూ కుటుంబ సభ్యుల అందరితో కలిసి ఘనంగా వినాయక చవితి పూజను నిర్వహించారు రోజా..

 

Related posts