అక్కినేని నాగచైతన్య-సాయి పల్లవి హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా వినాయకచవితిని పురస్కరించుకుని మూవీ యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.
మొదట ఈ సినిమాని ఏప్రిల్ 16న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ.. రెండో దశ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబరు10న విడుదలంటూ మరోసారి ప్రకటించారు. అయితే, చివరిలో ‘లవ్‌స్టోరీ’ వెనక్కి తగ్గడంతో గోపీచంద్ ‘సీటీమార్’ విడుదలైంది. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ సినిమాస్ నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు పలు మ్యూజిక్ ఛార్ట్ లలో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.