telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్నికల ఫలితాలు.. న్యూస్ చానెల్స్ మాత్రమే ప్రసారం.. ఇతర చానెళ్లు ..

కేంద్రం మరోసారి వినోద ప్రధాన చానళ్లపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నా, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హెచ్చరిక జారీచేసింది. నాన్-న్యూస్ చానళ్ల కేటగిరీలో ఉన్న టీవీ చానళ్లు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కంటెంట్ ను ప్రసారం చేయరాదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అమిత్ కాటోచ్ ఈ మేరకు ప్రయివేటు రంగంలో ఉన్న అన్ని వినోద ప్రధానమైన చానళ్లకు ఆదేశాలు జారీచేశారు.

నేటి ఫలితాల వార్తలు, కేవలం న్యూస్ చానల్ కేటగిరీలో రిజిస్టర్ అయిన చానళ్లు మాత్రమే ప్రసారం చేసుకోవచ్చని, నాన్-న్యూస్ చానల్ కేటగిరీలో రిజిస్టర్ అయిన చానళ్లు కేవలం వినోద సంబంధిత కార్యక్రమాలనే ప్రసారం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సాధారణంగా టీవీ చానళ్లకు అనుమతులు మంజూరు చేసే సమయంలో రెండు కేటగిరీలుగా విభజిస్తారు. ఒకటి నాన్-న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ కాగా, రెండోది న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్. మొదటిది ఎంటర్టయిన్ మెంట్ కిందకు వస్తుంది. రెండోది వార్తా ప్రసారాల కిందకు వస్తుంది.

Related posts