telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అఫిషీయ‌ల్‌.. ‘పుష్ప’ విల‌న్ ఫిక్స్‌

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అరిస్తారు. అయితే తాజాగా అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్లు తప్ప మారె అప్డేట్ రాలేదు. అయితే త్వరలోనే ఈ సినిమా టీజర్ విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా టీజర్‌ను బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇది ఇలా ఉండగా…. ఈ మూవీ విలన్‌ ఎవరనేది పెద్ద సస్పెన్స్‌ గా ఉంది. కొందరేమో…తమిళ హీరో విజయ్ సేతుపతి అని, మరికొందరు ఆర్య అని పెద్ద రూమర్స్‌ క్రియేట్‌ చేశారు. అయితే.. తాజాగా పుష్ప విలన్‌పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు అఫిషీయల్‌ అనౌన్స్‌మెంట్‌ చేసింది పుష్ప టీం. అతను ఎవరో కాదు… మళయాళం స్టార్‌ హీరో ఫాహద్ పాసిల్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ను ఢీ కొట్టేందుకు ఫాహద్ పాసిల్ వస్తున్నాడంటూ చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇక పుష్ప సినిమాతో ఫాహద్‌కు మరింత క్రేజ్‌ వస్తుందని అందరూ అనుకుంటున్నారు.

Related posts