telugu navyamedia
సినిమా వార్తలు

అదృష్టాన్ని నమ్ముకున్న వాడు కష్టాల పాలు అవుతాడు..

జబర్ధస్త్ కామెడీ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుని స్టార్ గా ఎదిగిన‌ సుడిగాలి సుధీర్‌. వెండితెరపై కూడా హిట్ కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘3 మంకీస్‌’ చిత్రాల్లో హీరోగా చిత్రాల్లో హీరోగా నటించాడు. అయితే ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఆయన ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. సుధీర్‌ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గాలోడు’.

Sudigali Sudheer's Mass Look From 'Gaalodu' - Movie News

రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. శుక్రవారం ఉదయం ‘గాలోడు’ టీజర్‌ను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

‘‘అదృష్టాన్ని నమ్ముకున్న వారు కష్టాలపాలు అవుతారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అదృష్టవంతులవుతారు. నేను రెండింటినీ నమ్ముకోను. నన్ను నేను నమ్ముకుంటా’’ అంటూ సుధీర్‌ చెప్పే డైలాగ్‌తో సాగిన ఈ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్‌ సీన్లలోనూ అద్భుతంగా నటించాడు.

కాగా ఈ సినిమాలో సుధీర్‌ సరసన గెహ్నా సిప్పీ హీరోయిన్‌గా నటించనుంది. సప్తగిరి, పృథ్వీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

Related posts