telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సాంకేతిక

గ్రహాంతరవాసుల కోసం .. ఎన్ని తిప్పలో.. అతిపెద్ద ..

huge telescope in china for aliens

భూ గ్రహం తరహాలో ఇంకో గ్రహంలో ప్రాణి ఉందా.. ఉంటె అవి ఎలా ఉన్నాయి.. అనేవాటిపై ఖగోళ రహాస్యాన్ని కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చైనా కూడా అతిపెద్ద టెలిస్కోప్ లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పరిమాణం గల టెలిస్కోప్‌గా వెల్లడించింది. దీనికి సంబంధించి అధికారిక కార్యకలాపాలను ప్రారంభించినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 500 మీటర్ల పరిమాణంలో సూక్ష్మరంధ్రంతో కూడిన గోళాకార టెలిస్కోప్ (FAST), దీని పరిమాణం 30 ఫుట్ బాల్ మైదానాలు కలిస్తే ఎంతో.. అంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. చైనాలో Sky Eye అనే పేరుతో పిలిచే పర్వత ప్రాంతమైన సౌత్ వెస్టరన్ ప్రావిన్స్‌లోని గుయీజౌలో ఈ టెలిస్కోప్‌ను నిర్మించారు. జాతీయ స్థాయిలో ఆమోదం పొందడంతో ఈ టెలిస్కోప్ కు సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించినట్టు రిపోర్టు తెలిపింది. 2016లోనే దీని నిర్మాణం పూర్తి అయింది. అప్పటినుంచి ఏళ్ల తరబడి టెస్టింగ్ రన్ జరుగుతోంది.

FAST చీఫ్ ఇంజినీర్ జియాంగ్ పెంగ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ టెలిస్కోప్ ట్రయల్ ఆపరేషన్స్ జరిగాయని అన్నారు. ఎంతో సున్నితమైన ఈ టెలిస్కోప్.. ప్రపంచ రెండో అతిపెద్ద టెలిస్కోప్ కంటే 2.5 రెట్లు కంటే ఎక్కువని ఆయన తెలిపారు. కొంత విలువైన సైంటిఫిక్ డేటాను కూడా ఈ ప్రాజెక్టు సమయంలో పొందినట్టు చెప్పారు. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో తక్కువ ప్రీక్వెన్సీ గురుత్వాకర్షణ వేవ్ డెటెక్షన్, నక్షత్ర అణువుల వంటి కొన్ని ప్రాంతాలను గుర్తించడానికి ఈ టెలిస్కోప్ దోహదపడుతుందని జియాంగ్ చెప్పారు. చైనా అంతరిక్ష ప్రొగ్రామ్ అభివృద్ధి చేయడమే బీజింగ్ ప్రాధాన్యతని, రష్యా, యునైటెడ్ స్టేట్స్‌ను అందుకుని 2030 నాటికి ప్రధాన అంతరిక్ష శక్తిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జియాంగ్ చెప్పారు. కాగా, వచ్చే ఏడాదిలో మానవ సహిత సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని బీజింగ్ యోచిస్తోంది.

Related posts