telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అందరికీ అన్నం పెట్టే రైతన్నా…

నువ్వు మట్టిలో బతుకుతావు
మా కోసం బతుకుతావు

మట్టిని దైవంగా కొలుస్తావు
పైరును ప్రాణంగా భావిస్తావు

నీ స్వేదంతో నేలను తడుపుతున్నావు
నేల నుంచి సిరులు పండిస్తున్నావు

వాన చుక్క కోసం పడిగాపులు కాస్తున్నావు
కరువు రక్కసితో నిరంతరం యుద్ధం చేస్తున్నావు

కష్టపడి పంట సాగు చేస్తున్నావు
గిట్టుబాటు ధర లేక రోదిస్తున్నావు

అందరికీ అన్నం పెడుతున్నావు
నువ్వు మాత్రం పురుగుల మందు సేవిస్తున్నావు

నీ నవ్వు మాకు సుభిక్షం రైతన్నా
నీ కన్నీరు మాకు దుర్బీక్షం రైతన్నా

రైతు బతుకులు మారాల్సింది చిత్రాల్లో కాదు
రైతు బతుకులు మారాల్సింది వ్యవసాయ క్షేత్రంలో

Related posts