telugu navyamedia
రాజకీయ వార్తలు

సుప్రీం తీర్పును దేశమంతా స్వాగతించింది: మోదీ

pm modi on kargil day

అయోధ్యలోని వివాదాస్పద భూవివాదంపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నూతన భారత్‌ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు నాంది అని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా వస్తున్న వివాదానికి నేటి తీర్పుతో శాశ్వతంగా ముగింపు పలికిందని మోదీ అభిప్రాయపడ్డారు.
సుప్రీం తీర్పును దేశమంతా స్వాగతించిందని అన్నారు.

అన్ని వర్గాల వాదనలను, అభిప్రాయాలను, సూచనలను సుప్రీం కోర్టు ఎంతో సహనంతో ఆలకించిందని పేర్కొన్నారు. దేశ న్యాయచరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం మొదలైందని, న్యాయమూర్తులు, న్యాయాలయాలకు శుభాభినందనలు అని వ్యాఖ్యానించారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రపంచమంతా గుర్తించిందని తెలిపారు.

తీర్పును ఎవరూ గెలుపోటములుగా చూడవద్దు. తీర్పును స్వాగతించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజలు చాలా సంయమనం పాటించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం నేడు సంపూర్ణత్వంతో వికసించిందని పేర్కొన్నారు. భారతదేశపు ఈ మూల మంత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని మోదీ వివరించారు.

Related posts