telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మున్సిపల్ ఎన్నికలు : ఏపీలో రేపే పోలింగ్

ఏపీలో పంచాయితీ ఎన్నికల వేడి తగ్గక ముందే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చేసాయి. ఏపీలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరగనుంది. ఇక, ఏపీ మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్‌ సోమవారం క్లోజ్ అయింది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు… బుధవారం పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2 వేల 215 డివిజన్లు, వార్డులకు కలిపి… 7,552 మంది బరిలో ఉన్నారు. పోలింగ్‌కు… అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 15 కార్పొరేషన్లు ఉంటే… శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రికి ఎన్నికలు జరగడం లేదు. చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకోవటం ఖాయమైంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడుతాయి. ఇక పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే… మున్సిపల్ ఎన్నికల్లోనూ… ఏకగ్రీవాల్లో అధికార పార్టీ సత్తా చాటింది. చిత్తూరులో 37 డివిజన్లను, తిరుపతి నగర పాలక సంస్థలో 21 డివిజన్లను, కడప నగర పాలక సంస్థలో 23 డివిజన్లను వైసీపీ సొంతం చేసుకుంది.  

Related posts