telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శంకర్ తో మెగాపవర్ స్టార్…?

RC

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ తరువాత తను చేయనున్న సినిమా కోసం అనేక మంది దర్శకులతో చర్చలు జరుపుతున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ క్రమంలో అనేక రూమర్లు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది దర్శకుల పేర్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా రోబో శంకర్‌కు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. శంకర్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారంట. అయితే ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారంట. ఈ మేరకు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు రామ్ చరణ్ తదుపరి చిత్రంపై అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలోనే ఈ సినిమాపై ప్రకటన చేయనున్నారంట. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వచ్చే నెల చివరికి ఆర్ఆర్ఆర్‌ను ముగించేందుకు చిత్ర యూనిట్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనేది.

Related posts