telugu navyamedia
రాజకీయ వార్తలు

మొరాయించిన ఈవీఎంలు..ఆలస్యంగా పోలింగ్

evm issues even in 4th schedule polling

సార్వత్రిక ఎన్నికల తుది విడుత పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఏడో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దేశవ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 లోక్‌సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తుది విడత పోలింగ్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పలు ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

బెంగాల్‌లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయలేదు.యూపీలో 13 చోట్ల, పంజాబ్ 13 చోట్ల, బెంగాల్‌లో 9 చోట్ల, బిహార్‌లో 4 చోట్ల, మధ్యప్రదేశ్‌లో 4 చోట్ల, హిమాచల్‌ప్రదేశ్లో 4 చోట్ల, జార్ఖండ్‌లో 3 చోట్ల, చండీగఢ్‌లో ఒక చోట పోలింగ్ జరుగుతోంది. ఇందులోనే ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. ఈ ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో 10.01 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Related posts